చంద్రబాబు టీవీల్లో కనిపిస్తే తల్లిదండ్రులు ఛానల్ మార్చేస్తారు!: విజయసాయి రెడ్డి

  • ఆయన్ను చూసి పిల్లలు జడుసుకున్నారు
  • దేవాన్ష్ కూడా ఏడాది దాకా ఏడ్చాడు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని విమర్శించారు. పుట్టిన పిల్లలందరికీ తన పేరే పెట్టాలని చంద్రబాబు జీవో జారీ చేయనందుకు రాష్ట్ర ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 68 ఏళ్ల వయసులో ఆయన తర్కం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ ప్రజలు సర్దుకుంటున్నారని ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్రబాబును చూస్తేనే పిల్లలు జడుసుకుని జ్వరాల పాలయ్యారనీ, అలాంటి వ్యక్తి గురించి అంగన్ వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు చెప్పాలా? అని ప్రశ్నించారు. ఏడాది వయసు వచ్చేవరకూ సొంత మనవడు దేవాన్ష్ కూడా చంద్రబాబును చూస్తే గుక్కపట్టి ఏడ్చేవాడని ఆరోపించారు. చంద్రబాబు టీవీల్లో కనిపిస్తే తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు వెంటనే ఛానల్ మారుస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Vijay Sai Reddy

More Telugu News